![]() |
![]() |

భరణి ఎలిమినేషన్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్-9 సాగుతోంది. ఈ సీజన్ లో టాప్-5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా అనుకుంటున్న భరణి ఎలిమినేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హౌస్ కి పెద్ద దిక్కుగా నిలిచిన భరణి ఎలిమినేట్ అవ్వడమనేది బిగ్ బాస్ ఆడియన్స్ తీసుకోలేకపోతున్నారు. కథ అంతా మారిపోయింది.. ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న రాముని సేవ్ చేసి, భరణిని ఎనిమినేట్ చేశారనే వార్తల నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తనూజకి నాన్నగా, దివ్యకి అన్నగా, ఇమ్మాన్యుయల్ కి మామగా భరణి హౌస్ లో చక్కని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హౌస్ లో అందరితో ప్రేమగా ఉంటూ గేమ్ లో తన వంద శాతం ఇస్తున్న భరణి ఎలిమినేట్ అవ్వడమనేది ఆడియన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత వారం శ్రీజని ఎలిమినేషన్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్.. భరణిని ఎలిమినేషన్ చేసి హౌస్ లోని కంటెస్టెంట్స్ కి పెద్ద షాకే ఇచ్చాడు.
సోషల్ మీడియాలో బిగ్ బాస్ షూటింగ్ కి సంబందించిన కొన్ని లీక్స్ వస్తుంటాయి. అయితే శనివారం, ఆదివారం నాటి ఎపిసోడ్ లకి సంబంధించిన లీక్స్ అన్ని సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుండే అప్డేట్ చేశారు. అన్ని సోషల్ మీడియా పేజీలలో భరణి ఎలిమినేషన్ అనే వార్తలే వస్తున్నాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భరణి హౌస్ లో కీ ప్లేయర్.. మన భాషలో చెప్పాలంటే దమ్మున్న కంటెస్టెంట్. మరి అతడిని నిజంగా ఎలిమినేషన్ చేశారా లేదా సీక్రెట్ రూమ్ లో ఉంచి వీక్ మిడిల్ లో హౌస్ లోకి తెస్తారా అనేది తెలియాల్సి ఉంది. నేడు(ఆదివారం) జరగబోయే ఎపిసోడ్ లో నిజంగానే భరణిని ఎనిమినేట్ అవుతాడా లేదా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
![]() |
![]() |